టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్ లో బుధవారం (ఆగస్టు-1) ప్రారంభమైంది.ఈ క్రమంలో ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

కొన్నేళ్లుగా భారత టెస్టు జట్టులో కొనసాగుతున్న టెస్టు స్పెషలిస్ట్ పుజారా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడు జట్టు నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియలేదు. అతని స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్, ఒక ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates