టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వేదికగా భారత్ –ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. సురేష్ రైనా, ధోనీ, ఆర్ జీ శర్మ, ధావన్, పాండ్యా, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వై. చాహెల్, సిద్దార్ద్ కౌల్ లతో కోహ్లీ సేన తొలివన్డేలో ఇంగ్లండ్ పై విక్టరీ కొట్టాలని ఉవిళ్లూరుతుంది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్లో క్రోయేషియా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆదేశ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నేడు భారత్‌ తో తొలి వన్డేలో గెలుపొంది తమ దేశ క్రీడాభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. 2019లో ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనుండటంతో…. అక్కడి పరిస్థితులు, పిచ్‌ లపై అంచనాకు వచ్చేందుకు కోహ్లీ సేనకు ఇదో మంచి అవకాశం.

Posted in Uncategorized

Latest Updates