టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారు: శంకరమ్మ

తనకు టికెట్ రాకపోతే మంత్రి జగదీశ్ రెడ్డిదే బాధ్యత అన్నారు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. నియోజక వర్గంలో పని చేయని సైది రెడ్డికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సపోర్ట్ ఉన్నా.. మంత్రి జగదీష్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డు పడుతున్నాడంటూ ఆవేధన వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రెడ్డికి అంత బలం ఉంటే హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

తనకు ఎలాంటి పదవులు వద్దని… ప్రజల మద్దతుతో సూర్యాపేట నుంచి పేట నుంచి పోటీ చేస్తానన్నారు. టికెట్ ఇవ్వకుండా అడ్డుకుంటే… తెలంగాణ సాధన కోసం అమరుడైన నా  కొడుకు శ్రీకాంత చారి లాగే…మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు శంకరమ్మ.

Posted in Uncategorized

Latest Updates