టిప్పు సుల్తాన్ ఖడ్గం మాయమైందా…ఏలా?

mallyatipuమైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్‌కు చెందిన ఖడ్గం మాయమైందటా… లికర్ కింగ్ విజయ్ మాల్యా దగ్గరున్న ఈ ఖడ్గం కన్పించడం లేదంటున్నారు. 2004లో జరిగిన వేలంలో రూ.1.5 కోట్లకు ఈ ఖడ్గాన్ని సొంతం చేసుకున్నాడు మాల్యా. ఆ ఖడ్గం ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అయితే ఆ ఖడ్గం తమకు దురదృష్టాన్ని తీసుకొచ్చిందని కుటుంబ సభ్యులు అనడంతో ఆ ఖడ్గాన్ని 2016లో మాల్యా ఎవరికో ఇచ్చేసినట్లు చెపుకుంటున్నారు. మాల్యాపై 13 బ్యాంకులు వేసిన కేసు విచారణ సందర్భంగా ఇది బయటకు వచ్చింది. ఆ బ్యాంకుల తరఫున వాదిస్తున్న లాయర్ లండన్ హైకోర్టులో మంగళవారం తన వాదనలను వినిపించారు.

ఆ టిప్పు సుల్తాన్ ఖడ్గం విలువ ఇప్పుడు రూ.1.8 కోట్లు ఉంటుంది. మాల్యా తన ఆస్తులన్నింటినీ మాయం చేస్తున్నాడు…అందులో భాగంగానే ఈ ఖడ్గాన్ని మాయం చేశాడని లాయర్ కోర్టులో వాదించారు. మాల్యా అంతర్జాతీయ ఆస్తులన్నింటినీ ప్రస్తుతం ఫ్రీజ్ చేశారు. దీనిని ఎత్తివేయకూడదని ఆ బ్యాంకులు కోర్టును కోరుతున్నాయి. అయితే ఈ చిన్న వస్తువును ఆధారంగా చూపి మాల్యా తన ఆస్తులని మాయం చేశారనడం సరికాదని అతని తరఫు లాయర్ వాదిస్తున్నారు. 13 బ్యాంకులకు 9 వేల కోట్ల మేర ముంచిన మాల్యా… పారిపోయి ప్రస్తుతం లండన్ లో తల దాసుకంటున్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates