టి-డయాగ్నోస్టిక్ సెంటర్స్ : అన్నిమెడికల్ టెస్ట్ లు ఉచితం

central-labప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించినా.. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు మాత్రం ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సిందే. ఇది పేదలపై భారం పడుతోంది. టెస్టుల పేరుతో అడ్డగోలు పరీక్షలు, ఇష్టానుసారం ధరలతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు. దీన్ని నివారించేందుకు.. తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం (టి-డయాగ్నోస్టిక్స్‌) పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. 15 రోజులుగా GHMC పరిధిలోని 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తనమూనాల సేకరణ, పరీక్షలు, ఆన్‌లైన్‌లో ఫలితాలను తెలిపేలా చర్యలు చేపడుతోంది. మరో నెల రోజులు పూర్తిగా పరిశీలించి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది సర్కార్.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను మధ్యాహ్నంలోపు సమీపంలోని పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు సంఖ్య, పాస్‌వర్డ్‌ ఉంటుంది. రోగి నుంచి నమూనాలు సేకరించినప్పుడే వారికి ఈ-మెయిల్‌ ఐడీ తీసుకుంటారు. రిపోర్ట్ ను ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేస్తారు. ప్రస్తుతానికి ఒక షిఫ్ట్ నమూనాలనే సేకరిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. 3 షిఫ్టుల్లోనూ అమలు చేస్తారు. ఇందుకోసం  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (IPM) ఆవరణలో ల్యాబ్ ను రూ.4 కోట్లతో ఆధునీకరిస్తారు . రోజుకు 10వేల పరీక్షలు చేయటానికి అనుగుణంగా ల్యాబ్ తయారు చేయబోతున్నారు. ఇందులో 53 రకాల రక్త పరీక్షలు చేయబోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates