టీంలో కొందరికే ఎక్కువ అవకాశాలు: హర్భజన్

టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ పై సంచలన కామెంట్లు చేశాడు. కొంత మంది క్రికెటర్లకు ఛాన్స్ లు ఎక్కువగా వస్తున్నాయని.. కొందరు ప్లేయర్స్ మాత్రం అవకాశాల కోసం సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని చెప్పాడు. టీం సెలక్షన్ ఓ రహస్యంలా కనిపిస్తోందని.. ఒక్కో ప్లేయర్ కు ఒక్కో నిబంధన ఎలా వర్తిస్తుందో అర్థం కావడం లేదన్నాడు.

విండీస్ తో సిరీస్ కు టీంలోకి వచ్చిన హనుమ విహారీ బాగా ఆడాలని తాను కోరుకుంటున్నాని హర్భజన్ అన్నాడు. అయితే హనుమ విహారీ సరిగ్గా రాణించకపోతే అతన్ని తప్పించి కరుణ్ నాయర్ కు ఛాన్స్ ఇస్తారా అని ప్రశ్నించాడు. ఆస్ర్టేలియా టూర్ కు ముందే టీం సెలక్షన్ లో ఉన్న లోపాలను కరెక్ట్ చేయాలని సూచించాడు  వెస్టిండీస్ తో సిరీస్ కు సెలెక్ట్ చేసిన ఇండియన్ టీం పై తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో భజ్జీ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

 

 

 

Posted in Uncategorized

Latest Updates