టీఆర్ఎస్ గన్ షాట్… బుల్లెట్ దిగిందన్న కేటీఆర్

కేటీఆర్‌ తన ట్విటర్‌ పేజీలో కొత్త ప్రొఫైల్‌ ఫొటోను పెట్టారు. తుపాకీ పట్టుకుని గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోకు ఇప్పటికే 16 వేల లైక్‌లు, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి. ‘కేటీఆర్‌..గురిచూసి కొడుతున్నార్‌..విజయం ఆయనదే..’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ TRS అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లు పెడుతున్నారు.

కేటీఆర్‌ పోస్ట్‌ చేసిన ఈ కొత్త ఫొటోపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ స్పందించారు. ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్‌..ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అని వెంకట్‌ ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోపై డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కూడా కామెంట్‌ చేశారు. ‘ఈ ఫొటో కాన్ఫిడెన్స్‌ కు కొత్త అర్థం చెబుతోంది. ఫలితాల క్రమంలో కేటీఆర్‌ కొత్త ఫొటోను పెట్టారు’ అని ట్వీట్‌ చేశారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్‌ TRS లీడ్ లో ముందుకెళ్తోంది.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates