టీఆర్ఎస్  మాటల పార్టీ  కాదు: హరీష్

టీఆర్ఎస్  ప్రజల  హృదయాల  నుంచి  వచ్చిన పార్టీ  అన్నారు  మంత్రి హరీష్ రావు . తమకు  హైకమాండ్  ఢిల్లీలో లేదని చెప్పారు. TRS  ఆత్మ ….తెలంగాణ  ప్రజల్లో  ఉందన్నారు  హరీష్.  ఉమ్మడి  మెదక్ జిల్లాలో  ట్రాన్స్ పోర్ట్ మంత్రి మహేందర్ రెడ్డి,  డిప్యూటీ స్పీకర్  పద్మాదేవేందర్ రెడ్డితో  కలసి  పర్యటించారు. గురువారం(జూలై-26)  ఉదయం నుంచి  హత్నూర మండల్ లో  పలు అభివృద్ధి  కార్యక్రమాల్లో  పాల్గొన్నారు నేతలు.  తర్వాత  నర్సాపూర్ లో రూ.10కోట్లతో  బస్ డిపోకు…. ఫౌండేషన్ స్టోన్  వేశారు. త్వరలోనే బస్ డిపోను  ప్రజలకు  అందుబాటులోకి  తెస్తామన్నారు. గత పాలకులు నర్సాపూర్ అభివృద్దిని నిర్లక్ష్యం చేశారన్న మంత్రి హరీష్ రావు… టీఆర్ఎస్  మాటల పార్టీ  కాదు.. చేతల  పార్టీ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates