టీఆర్ఎస్ శాసన సభాపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎన్నిక

టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు 88మంది హాజరయ్యారు. కేసీఆర్ ను ఎల్పీ నేతగా ఏకగ్రీంగా ఎన్నుకుంటున్నట్టు నేతలు ప్రకటించారు.

ఏకగ్రీవ తీర్మాన ప్రతిపై టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ సంతకం పెట్టారు. ఈ ప్రతిని రాజ్ భవన్ కు గవర్నర్ సమక్షానికి పంపిస్తారు. దీంతో… మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎంగా కేసీఆర్ ను గవర్నర్ ఆహ్వానిస్తారు. రేపు డిసెంబర్ 13 మధ్యాహ్నం 1.30కు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎవరెవరిని తీసుకుంటున్నారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Posted in Uncategorized

Latest Updates