అల్లరి చేసిన పిల్లల నోటికి ప్లాస్టర్ : టీచర్ సస్పెన్షన్

గుర్‌గావ్‌ : పిల్లలు అంటేనే అల్లరి. అందులో 5 సంవత్సరాల లోపు పిల్లలు మరీ అల్లరి చేస్తారు. అల్లరి చేయవద్దంటూ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన టీచర్ వారితో దురుసుగా ప్రవర్తించింది. ప్రీ నర్సరీ పిల్లలు అల్లరి చేశారంటూ మూతికి ప్లాస్టర్ వేసింది ఓ టీచరు. ఈ ఘటన హర్యానా లోని గుర్‌గావ్‌లో జరిగింది. నాలుగేళ్ల వయస్సున్న బాలుడు, బాలిక ఇద్దరు ఓ ప్రైవేటు బడిలో ప్రీ నర్సరీ చదువుతున్నారు. క్లాస్ లో పాఠాలు చెప్తుంటే వీరు బాగా అల్లరి చేస్తున్నారని.. క్లాస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయడంతో పాటు బూతులు కూడా మాట్లాడుతున్నట్లు టీచర్ చెప్పింది. వీరి అల్లరి ఆపేందుకు తాను ఇద్దరి పిల్లల నోటికి ప్లాస్టర్ వేసినట్లు తెలిపింది. విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో మేనేజ్‌మెంట్ టీచర్ ను సస్పెండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates