టీటీడీలో నిధుల దుర్వినియోగం అరికట్టాలంటూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, హైదరాబాద్ కు చెందిన లా స్టూడెంట్  సత్య సభర్వాల్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకుంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు… నిధులు పక్కదారి పట్టడంపై ఎప్పటినుంచో పలు వివాదాలున్నాయి. టీటీడీ విధానాల్లో ప్రభుత్వ జోక్యం పెరగడం వల్లే పలు అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ అజమాయిషీ నుంచి టీటీడీని తప్పించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. టీటీడీలో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని … భక్తులద్వారా వచ్చే ఆదాయాన్ని సరైన పద్ధతిలో వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.

Posted in Uncategorized

Latest Updates