టీటీడీ సేవా టికెట్లలో కుంభకోణం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం జారీచేసే సేవా టిక్కెట్లలో కొత్తగా మరో స్కామ్ బయటపడింది. ఆన్ లైన్ లక్కీ డిప్ సేవా టిక్కెట్లును అక్రమంగా అమ్ముతున్న మరో దళారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లక్కీడిప్ స్కీమ్ కోసం.. 1 వెయ్యి 850 సేవా టిక్కెట్లను పొందేందుకు.. ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి.. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు విజిలెన్స్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన బాలచందర్.. ఇలా నకిలీ గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు గుర్తించారు.

ఈ ఏడాదిలో 100 సుప్రభాతం సేవ టికెట్లను బాలచందర్ అక్రమంగా పొందినట్టు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. శశికుమార్, రాజేశ్వరి నకిలీ ఐడీలతో సుప్రభాతం టికెట్లను లక్కీ డిప్ లోదక్కించుకున్నాడు బాలచందర్. సేలంకు చెందిన రామస్వామి, పద్మావతి లకు… రెండు సుప్రభాతం సేవా టికెట్లను 2వేల రూపాయలకు ఒకటి చెప్పున అమ్మినట్టు బాలచందర్ ఒప్పుకున్నాడు.

ఇదే పద్ధతిలో మరో ఇద్దరు కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే షోలాపూర్, టీటీడీ కాల్ సెంటర్, బెంగళూరు కేంద్రంగా అక్రమాలకు పాల్పడిన దళారులను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు, గుంటూరు లోనూ.. ఇదే పద్ధతిలో లక్కీడిప్ సేవా టికెట్లను దక్కించుకుంటున్న అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates