టీడీపీతో కాంగ్రెస్ పొత్తా థూ.. మీ బతుకు చెడ : కేసీఆర్

కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇవాళ (అక్టోబర్-3) నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణను అడ్డుకున్న టీడీపీతో చేతులు కలిపిన వీరిది ఓ బతుకేనా అన్నారు. సిగ్గు లేకుండా చంద్రబాబుతో పొత్తు కలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. థూ.. మీ బతుకులు చెడ.. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. తెలంగాణ ద్రోహి.. చెడిపోయి చంద్రబాబుతో పొత్తా.. అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు. కరెంట్ ఇవ్వకుండా రాక్షాసనందం పొందిన రాక్షాసి చంద్రబాబు అని చెప్పారు సీఎం.

కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పగిస్తామా అని చెప్పిన కేసీఆర్..ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. దుర్మార్గులకు బుద్ధి చెప్పేందుకు నిజామాబాద్ లోని 9 సీట్లను గెలిపించి సరైన సమాధానం ఇవ్వాలన్నారు. 7 మండలాలను గుంజుకున్న దుర్మర్గుడు చంద్రబాబు అని..బాబుతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు నోటు కింద దొరికి దొంగ చంద్రబాబు అన్నారు. నోరు తెరిస్తే తెల్లారిందాక తిడుతాను కానీ..సీఎం హోదా ఉంది కాబట్టి తిట్టలేకపోతున్నానని..ఉత్తమ తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రజలే ఓట్లతో సమాధానం చెప్తారన్నారు. 2014లాగే అత్యథిక మెజార్టీతో 9 సీట్లను గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates