టీడీపీ ఎంపీ సంచలన కామెంట్స్ : లోకేష్ ను హిప్నటైజ్ చేశారు

ఏపీ మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేష్ ను కర్నూలు  ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  హిప్నటైజ్ చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్. అందుకే ప్రభుత్వ సభలో పార్టీ తరఫున అభ్యర్థులను  ప్రకటించారనీ అన్నారు. అయినా టికెట్ల ప్రకటన అనేది పార్టీ అధినేత చంద్రబాబు చేస్తారంటూ లోకేష్ స్థాయిపైనా చురకలు అంటించారు. లోకేష్ ప్రకటన ఫైనల్ కాదన్నారు. చంద్రబాబు నిర్ణయం తర్వాతే తన రియాక్షన్ ఉంటుందన్నారు టీజీ. ఎంపీ టీజీ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. లోకేష్ నే సవాల్ చేసినట్లు ఉన్నాయని అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates