టీడీపీ కడప ఉక్కు దీక్ష భగ్నం : బీటెక్ రవి ఆస్పత్రికి తరలింపు

btechకడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయాలంటూ  ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ  బీటెక్ రవి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయాలంటూ ఎనిమిది రోజులుగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. బుధవారం ఆరోగ్యం క్షీణించంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీటెక్ రవిని పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో రిమ్స్‌ కు తరలించారు.  షుగర్‌, బీపీ లెవల్స్ ప్రమాదకర స్థాయికి చేరడంతో అత్యవసర ట్రీట్ మెంట్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా దీక్షా స్థలి దగ్గరకు చేరుకొని రవి దీక్షను భగ్నం చేశారు. ఎంపీ సీఎం రమేశ్‌ను కూడా హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. సీఎం రమేష్ దీక్షను కొనసాగిస్తున్నారు. పోలీసులు రవిని అంబులెన్సులో హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో  దీక్ష వేదిక దగ్గర ఉన్న టీడీపీ కార్యకర్తలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

 

Posted in Uncategorized

Latest Updates