టీడీపీ తో పొత్తువద్దని ముందే చెప్పా : విజయశాంతి

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు వద్దని తాను ముందే హెచ్చరించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. మెదక్ జిల్లా నుండి తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆవేదనను వ్యక్తం చేశారు. పొత్తు వల్ల సోంత వ్యూహాలను సైతం పక్కన పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. పొత్తు వల్ల జరిగిన నష్టంపై పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇస్తానని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికైనా తప్పులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates