టీమిండియాపై వసీం అక్రమ్ ప్రశంసలు

పాకిస్థాన్ : టీమిండియా పై వసీం అక్రం ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్ లో కోహ్లి లేకుండానే భారత జట్టు వరుస విజయాలు సాధించడం గొప్ప విషయమన్నాడు. కీలక ఆటగాడు లేనప్పటికీ టీమిండియా సూపర్ గా ఆడుతోందని చెప్పాడు.

మరోవైపు పాక్ టీం వరుస మ్యాచ్ లలో ఓడిపోవడంపై వసీం సీరియస్ అయ్యాడు. బౌలింగ్ , బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో పాక్ జట్టు చెత్తగా ఆడుతోందని… ఏ విభాగంలోనూ టీం సభ్యులు ప్రతిభ చూపించడం లేదని అన్నాడు. నిన్న(ఆదివారం) మ్యాచ్ జరిగిన గ్రౌండ్ పాకిస్థాన్ కు హోం గ్రౌండ్ లాంటిదని..  పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Posted in Uncategorized

Latest Updates