టీమిండియా కోచ్‌గా రామన్‌

 టీమిండియా భారత మహిళల జట్టు కోచ్ గా  వెంకట రామన్ ఎంపికయ్యారు. కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి లతో కూడిన కమిటీ గ్యారీ క్రిస్టియన్ ను సూచించగా.. బీసీసీఐ మాత్రం రామన్ వైపు మొగ్గుచూపింది. 53 ఏళ్ల రామన్ ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ కోచ్ గా ఉన్నారు.  భారత్ తరపున 11 టెస్టులు ఆడి 448 పరుగులు చేశారు. 27 వన్డేల్లో 617 పరుగులు సాధించారు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన రామన్ ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ సక్సెస్ అయ్యారు. భారత్ లోని సక్సెస్ ఫుల్ కోచ్ లలో రామన్ ముందువరుసలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates