టీమిండియా నెట్ ప్రాక్టీస్: రేపటి నుంచి ఇంగ్లండ్ తో మ్యాచ్

teamindiaటీమిండియా మంగళవారం(జూలై-3) నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న పర్యటనపై దృష్టి సారించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 జరిగే మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో కోహ్లి సేన నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమైంది.

గత ఇంగ్లండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఫైనల్ జట్టు ఎంపిక కొద్ది కొంచెం కష్టంగానే తయారయ్యింది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates