టీవీ ఛానళ్ల ధరలు పెంచొద్దంటూ.. కేబుల్ ఆపరేటర్ల ధర్న

కరీంనగర్ : నెలవారి కేబుల్ టీవీ చార్జీలు పెంచాలన్న ట్రాయ్ నిబంధనలను నిరసిస్తూ..ఆదివారం జమ్మికుంటలో కేబుల్ ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు. నాలుగు మండలాల కేబుల్ ఆపరేటర్లు జమ్మికుంటలో నిరసన ర్యాలీ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates