టీవీ సీరియల్స్ ను మించిన క్రూరత్వం : పెళ్లి విందులో విషం కలిపిన మహిళ

poisonఓరి నాయనా.. ఈ విషయం వింటేనే వణికిపోతున్నాం.. ఇంత క్రూరత్వమైన ఆలోచన ఎలా వచ్చిందో కూడా అర్థం కావటం లేదు.. ఎక్కడా.. ఎప్పుడూ కూడా ఇలాంటి హత్యలు చేయాలన్న ఆలోచన ఉన్న వారిని కూడ చూడలేదు అంటున్నారు పోలీసులు. పెళ్లి విందు భోజనాల్లో విషం కలిపి కలకలం రేపింది ఈ మహిళ. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రాష్ట్రం ఖాలాపూర్ ప్రాంతం. జ్యోతి అనే మహిళకు సురేష్ తో రెండేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. జ్యోతి నలుపు. పెళ్లి సమయంలో కట్నకానుకలు బాగా ఇవ్వటంతో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారం.. ఆ తర్వాత మలుపు తిరిగింది. నల్లగా ఉన్నావు.. నున్ను చూస్తుంటే ఛండాలంగా ఉంది అంటూ జ్యోతిని అత్తింటి వారు వేధించటం మొదలుపెట్టారు. చాలా కాలంగా వేధింపులు ఉన్నా.. భరిస్తూనే వచ్చింది.

ఇటీవల జ్యోతికి వేధింపులు మరీ ఎక్కువ అయ్యాయి. ఎలాగైనా అత్తింటి మొత్తాన్ని లేపేయాలని ప్లాన్ చేసింది. టైం కోసం చూస్తుంది. ఇదే టైంలో పహాడ్ గ్రామంలో తన బంధువు అయిన సుభాష్ ఇంట్లో శుభకార్యం ఉందని ఆహ్వానం అందింది. ఇదే అదునుగా భావించింది. అత్తింటి వారితో కలిసి జ్యోతి కూడా పెళ్లికి వెళ్లింది. పెళ్లి భోజనంలో విషం కలిపి అత్తింటి మొత్తాన్ని చంపాలని నిర్ణయించి.. విందు భోజనంలో విషం కలిపింది. ఈ భోజనం అందరికీ వెళ్లింది. దాన్ని అడ్డుకుంటే తన కుట్ర ఎక్కడ బయట పడుతుందో అని సైలెంట్ గా ఉంది. విషం కలిపిన ఆహారాన్ని 100 మంది వరకు తిన్నారు. ఆ వెంటనే వాంతులు అయ్యాయి. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 5 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న నలుగురు చిన్నారులు చనిపోయారు. 50 ఏళ్ల మరో వృద్ధుడు కూడా చనిపోయారు. మరికొంత మంది ఆరోగ్యం విషమంగా ఉంది. పెళ్లి విందులో ఇంత మంది అస్వస్థకు గురవ్వటంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆహార పదార్ధాలను ల్యాబ్ కు పంపించారు. అందులో విషం ఉందని నిర్ధారించారు. విచారణ చేయగా జ్యోతినే ఈ విషం కలిపినట్లు తేలింది. అరెస్ట్ చేశారు. అత్తింటిపై పగ.. ఐదుగురు ప్రాణాలు తీసింది. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల జీవితాలను సమాధి చేసింది.

Posted in Uncategorized

Latest Updates