టీ-యాప్ ఫోలియో : ఒక్క క్లిక్ తో 500 సర్కార్ సేవలు

T APPఈ-సేవ, మీ-సేవలకు కాలం చెల్లిందా.. ఇంట్లో ఉండే సర్కార్ సేవలు చేసుకోవచ్చా.. అవును అంటోంది తెలంగాణ ప్రభుత్వం. టీ-యాప్ ఫోలియో పేరుతో ఓ మొబైల్ యాప్ తీసుకు వస్తోంది.
ఐటీ శాఖతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు సంయుక్తంగా ఈ యాప్ ను అభివృద్ధి చేస్తున్నాయి.  ప్రస్తుతం మీ-సేవ ద్వారా 600 సేవలు అందిస్తుండగా.. వీటిలో 150 సేవలు ఈ యాప్ ద్వారా మొదటి దశలో అందుబాటులోకి రానున్నాయి. విడుతల వారీగా 500 వరకు సేవలను పెంచనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో దీన్ని ఆవిష్కరించనున్నారు.

ఫీచర్స్

… GHMC, BSNL, పోలీసు, వ్యవసాయ, రహణ, దేవాదాయ, EPF, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఇతర శాఖలను చెందిన సేవలు లభించనున్నాయి.

… హైదరాబాద్ ఫరిదిలో  ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, డ్రింకింగ్ వాటర్ బిల్లులు, ట్రాఫిక్ చలానా, ఆస్తిపన్ను చెల్లింపులు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజు వంటి సేవలు ఉంటాయి.

… బస్సు, రైలు, విమానం టికెట్ బుకింగ్స్, హాటల్ బుకింగ్స్, క్రికెట్ మ్యాచ్ టికెట్ బుకింగ్స్, LIC ప్రీమియం, హస్పిటల్ బిల్లుల చెల్లంపులు చేయవచ్చు.

… పుణ్యక్షేత్రాల ఆలయాలకు  ఆన్ లైన్ దర్శన టికెట్ బుకింగ్స్. బ్లడ్ బ్యాంక్, ఇతర అత్యవసర సేవలు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.

… స్టూడెంట్స్ కోసం పదో తరగతి, ఇంటర్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపులు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఫథకాలు, ఉపకార వేతనాలు, వేదేశీ విద్యకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates