టీ 20 ఆసియా కప్ : భారత్ చేతిలో పాక్ చిత్తు

pakinningsaasda

భారత్ చేతిలో పాకిస్తాన్ కు మరోసారి ఓటమి తప్పలేదు. కాకపోతే ఈసారి మహిళల చేతిలో. టీ 20 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. 73 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అమ్మాయిలు.. కేవలం 16.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించారు. 7 వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి ఫైనల్ కు చేరుకున్నారు. మొదటి ఓవర్ లోనే మిథాలీరాజ్ ఔట్ అయ్యింది. దీంతో భారత జట్టులో టెన్షన్ మొదలైంది. ఈ తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్పృతి మంధాన నిలకడగా ఆడింది. 38 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 34 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి పాక్ తడబడింది. నహఇద, సనామిర్ మాత్రమే 18, 20 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. మిగతా వాళ్లు అందరూ 7, 8, 9 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో బిస్త్ మూడు వికెట్లు తీసి పాక్ ను చావుదెబ్బ కొట్టింది.

Posted in Uncategorized

Latest Updates