టీ 20 ఫైనల్ ఫైట్ : గెలిచేదెవరు.. సిరీస్ ఎవరిది

South-Africa-v-Indiaసౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ ఫైనల్ ఫైట్ కు రెడీ అయ్యింది  టీమిండియా. సిరీస్ డెలిసిషన్ మ్యాచ్ కావటంతో అంతా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచి.. సౌతాఫ్రికా గడ్డపై ఆధిపత్యం సాధించాలని కసితో బరిలోకి దిగుతుంది కోహ్లీ సేన. ఈ మ్యాచ్ గెలుపుతో చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నారు కుర్రోళ్లు.

వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. అదే ఊపు కొనసాగిస్తోంది. బ్యాటింగ్ లో బలంగా ఉంది. ఓపెనర్ రోహిత్ కూడా ఫాంలోకి రావటంతో టాప్ ఆర్డర్ మొత్తం దుమ్మురేపటానికి రెడీ అంటోంది. ధావన్, రైనా, కోహ్లీ, మనీశ్ పాండే, ధోనీ బ్యాంటింగ్ తో మెరుపులు ఖాయం అంటున్నారు. బౌలింగ్ లోనే తడబాటు కనిపిస్తోంది. గాయంతో రెండో టీ-20కి దురమైన బుమ్రా.. ఈ మ్యాచ్ లో ఆడటం కష్టమే. పేసర్ జయదేవ్ రాణిస్తే మాత్రం టీమిండియాదే పైచేయి. చాహల్, శార్దూల్ ఠాకూర్ పరుగులు ఇవ్వటంలో పిసినారితనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికితోడు కేప్ టౌన్ గ్రౌండ్ సెంటిమెంట్ గా భారత్ అచ్చొచ్చిన పిచ్.

సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. అందరూ కొత్త ఆటగాళ్లు. ఇది టీమిండియాకు మైనస్. ఎవరు ఎలా ఆడతారో పూర్తిగా అవగాహన లేదు. దీనికితోడు బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా బలంగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates