టీ20లో వండర్ : వీర బాదుడికి.. అందరి చూపు ఆకాశం వైపు

New-Zealand-Austillaబ్యాటింగ్ బద్దలు.. బాల్ పగిలిపోయింది.. ఒకరికి మించి ఒకరు.. బ్యాటింగ్ బీభత్సం అంటే ఇదే. స్టేడియంలోని ప్రేక్షకులు అయితే.. కళ్లన్నీ ఆకాశం వైపే ఉన్నాయి. బాల్ పడిగే చాలు.. అది ఫోర్ లేదా సిక్స్. గాల్లో లేచిన బాల్ ఎక్కడ పడుతుందో చూడటం కోసం అందరూ తలలు ఎత్తి మరీ చూశారు. మ్యాచ్ మొత్తం 240 బంతులు.. రెండు జట్లు కలిసి ఎన్ని పరుగులు చేశాయో తెలుసా.. 487. అంటే ఒక్క బాల్ కు.. రెండు రన్స్ వచ్చాయి. అంటే మ్యాచ్ ఎలా జరిగి ఉంటుందో తెలుస్తుంది కదా.. టీ20 మ్యాచ్ రికార్డ్ అన్నీ తిరగరాసిని న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా మ్యాచ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త చరిత్రను లిఖించింది.

న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ 20 మ్యాచ్ ఇది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటి న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 243 రన్స్ చేసింది. మార్టిన్ 54 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 9 సిక్స్ లు ఉన్నాయి. కొలిన్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్ లతో 76 పరుగులు చేశాడు. వీళ్లద్దరే కలిసి 181 రన్స్ చేశారు. 243 పరుగులు భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా టార్గెట్ ఛేజ్ కోసం గ్రౌండ్ లోకి అడుగు పెట్టింది.. అసలు ఆట అప్పుడు మొదలైంది.

డేవిడ్ వార్నర్.. 24 బంతుల్లో 59 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్ లు. ఆ తర్వాత షార్ట్ 44 బాల్స్ లో 76 పరుగులు. 8 ఫోర్లు, 3 సిక్స్ లు. మ్యాక్స్ వెల్ 14 బంతుల్లో 31 రన్స్. 3 ఫోర్లు, 2 సిక్స్ లు. ఆ తర్వాత వచ్చిన ఫిన్చ్ 14 బంతుల్లో 36 పరుగులు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. 244 టార్గెట్ ను ఏఢు బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది ఆస్ట్రేలియా.

2015లో 232 పరుగుల టార్గెట్ ఛేదించి విండీస్ పేరిట ఉన్న ఈ వాల్డ్ రికార్డ్ ను.. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్రేక్ చేసింది. టీ 20 క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల దెబ్బకు స్టేడియం హోరెత్తింది. అందరి చూపు ఆకాశం వైపే.. బాల్ ఫోర్ వెళుతుందా.. సిక్స్ పడుతుందా అని..

Posted in Uncategorized

Latest Updates