టీ20 క్రికెట్ లో అరుదైన ఘనత సాధించిన ధోని

DHONIచెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. టీ 20 క్రికెట్లో 6వేలకు పైగా రన్స్ చేసిన ఐదో ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం(మే-18) ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు 6వేల పరుగుల క్లబ్ కు 10 రన్స్ దూరంలో ఉన్న ధోనీ… మ్యాచ్ లో 17 రన్స్ చేశాడు. ఇప్పటి వరకు టీ-20ల్లో సురేశ్ రైనా 7 వేల 708 రన్స్ చేయగా… విరాట్ కోహ్లీ 7 వేల 621, రోహిత్ శర్మ 7వేల 303, గౌతమ్ గంభీర్ 6 వేల 402 రన్స్ చేసి ధోనీ కంటే ముందున్నారు.

Posted in Uncategorized

Latest Updates