టీ20 ట్రై సిరీస్ : ఇంగ్లాండ్ టార్గెట్-199

madanasuperbmatchటీ20 ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ మహిళలతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా అమ్మాయిలు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు స్మృతి మంధాన(76 40 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు), మిథాలీ రాజ్(53 43 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 4 వికెట్లు కోల్పోయిన భారత్ 198 పరుగులు చేసింది. వీరిద్దరూ జట్టుకు మంచి పునాది వేశారు. జట్టు స్కోరు 129 వద్ద భారత్ మంధాన రూపంలో తొలి వికెట్ చేజార్చుకుంది. ఆఖర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(30), పూజా వస్ర్తాకర్(22 నాటౌట్) విజృంభించారు. ఆతిథ్య బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నప్పటికీ ఇంగ్లీష్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరం విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్‌లో పుంజుకొని అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు తమవంతు పాత్ర పోషిస్తే భారత్ సునాయాసంగా గెలుపొందనుంది.

Posted in Uncategorized

Latest Updates