టీ20 ట్రై సిరీస్: కోహ్లీ బ్యాట్ తో చెలరేగిన డానియెల్లి

Dannielleటీ20 ట్రై సిరీస్ లో భారత మహిళల జట్టుపై ఇంగ్లాండ్  ఉమెన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం(మార్చి-25) ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఉమెన్స్ జట్టు మరో ఓటమి చవిచూసింది.  స్మృతి మంధాన, మిథాలీలు హాఫ్‌ సెంచరీలతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా ఇంగ్లాండ్ టీం ఈజీగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డానియెల్లి యాట్‌ 124 (64 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో జట్టు విజయాన్ని కారణమైంది.  డానియెల్లికి అండగా టామీ బీయుమెంట్‌ 35 నిలిచింది. చివర్లో  టామీ అవుటైనా హెథర్‌ (8) టార్గెట్‌ను పూర్తి చేసింది. దీంతో ఇంగ్లండ్‌ 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకోంది.  టీ20ల్లో ఇది అత్యధిక పరుగుల టార్గెట్ రీచ్ చేసి రికార్డుకెక్కగా.. 52 బంతుల్లోనే డానియెల్లి  రెండో సెంచరీని నమోదు చేసింది.

భారత మహిళలకు ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లో కంగుతిన్న టీమిండియా.. అంతకు ముందు  ఆస్ట్రేలియాతో మూడు వన్డే సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ అయింది. ఈ పరాజయంతో భారత్‌ ఈ ట్రైసిరీస్‌ ఫైనల్‌ చేరడం కష్టంగా మారనుంది.

డానియెల్లి యాట్‌ ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తో ఆడుతానని సిరీస్ కు ముందు ప్రకటించింది. ఆ బ్యాట్‌తోనే కోహ్లీలా రెచ్చిపోయిన డానియెల్లి  15 ఫోర్లు, 5 సిక్సర్లతో పరుగుల వరద పారించింది.

Posted in Uncategorized

Latest Updates