టీ20 మ‌హిళా జ‌ట్ల ర్యాంకింగ్స్ : 5వ స్థానంలో భారత్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్ (ICC) టీ20 మహిళా జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ 5వ స్థానం ద‌క్కింది. మొత్తం 46 జట్లకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మొదటి 10 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, భారత్‌, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ ఈ ఏడాది వెస్టిండీలో  జరిగే వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. వీటితోపాటు అసోసియేట్‌ దేశాలు పాల్గొనే అన్ని టీ20 మ్యాచ్‌లకు ఇకపై అంతర్జాతీయ హోదా ఇవ్వనున్న‌ట్లు ICC  ప్ర‌క‌టించింది. ర్యాంకింగ్స్‌లో స్థానం పొందాలంటే ప్రతి జట్టు ఇకపై ఏడాదికి ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates