టీ20 సిరీస్ మనదే : ఇంగ్లాండ్ పై టీమిండియా విక్టరీ

DhmJpdFW4AAhGlHటీ20 సిరీస్ లో భాగంగా ఆదివారం (జూలై-8) బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ విక్టరీ సాధించింది టీమిండియా. ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ..నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన భారత్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ 100 సెంచరీతో చెలరేగాడు. భారత్ 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి మరో టీ20 సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ వరుసగా 6టీ20 సిరీస్ లను సొంతం చేసుకున్న రికార్డును బద్దలుకొట్టింది. 3 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలిచింది.

రోహిత్ రికార్డ్
ఈ మ్యాచ్‌ లో సెంచ‌రీతోపాటు టీ20ల్లో 2 వేల ప‌రుగుల మైలురాయిని కూడా రోహిత్ అందుకోవ‌డం విశేషం. అత‌డు కేవ‌లం 56 బంతుల్లోనే టీ20ల్లో మూడో సెంచ‌రీ చేశాడు. టీ20ల్లో మూడు సెంచ‌రీలు చేసిన రెండో బ్యాట్స్‌ మ‌న్ రోహిత్‌శ‌ర్మ‌. అత‌ను గ‌తంలో సౌతాఫ్రికా, శ్రీలంక‌ల‌పై సెంచ‌రీలు చేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates