టీ20: IPL తరహాలో ఉమెన్స్ క్రికెటర్ల టీంలు

WOMENSమహిళా క్రికెటర్ల కోసం బీసీసీఐ మే-22న టీ20 మ్యాచ్‌ నిర్వహించబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తరహాలో ఈ మ్యాచ్‌లో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లతో పాటు పాటు విదేశీ మహిళా క్రికెటర్లు కూడా పాల్గొననున్నారు. రెండు జట్లకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంథాన కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. మే 22న ముంబైలో మధ్యాహ్నం 2.30గంటలకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. మొత్తం 26 మంది ప్లేయర్లు ఈ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌కు చెందిన 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మ్యాచ్ కు సంబంధించి BCCI జట్లు పేర్లను…జట్టు సభ్యుల పేర్లను ప్రకటించింది.

IPL ట్రయల్‌ బ్రేజర్స్‌: స్మృతి మంధాన(కెప్టెన్‌), అలిసా హీలీ(వికెట్‌ కీపర్‌), సుజె బేట్స్‌, దీప్తి శర్మ, బెత్‌ మూనీ, రోడ్రిక్స్‌, డానియల్‌ హాజెల్‌, శిఖా పాండే, లీ టహుహు, జులన్‌ గోస్వామి, ఏక్తా బిస్ట్, పూనమ్‌ యాదవ్‌, హేమలత.

IPL సూపర్ ‌నోవాస్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, మెక్‌లానింగ్‌, సోఫీ డివైన్‌, ఎలిసన్‌ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోన మెశ్రమ్‌, పూజా, మేగన్‌ స్కౌట్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, అనూజ పాటిల్‌, తానియా భాటియా(వికెట్‌ కీపర్‌).

Posted in Uncategorized

Latest Updates