టూమచ్ కదా : విద్యార్థితో మూత్రం కలిపిన జ్యూస్ తాగించిన టీచర్

aa-Cover-hii167lianrn6tpvhjjt0e35b1-20180206155333.Mediచిన్న పిల్లాడి చేత మూత్రం కలిపిన ఫ్రూట్ జ్యూస్ తాగించాడు ఓ టీచర్. ప్రకాశం జిల్లా చీరాల టౌన్ లోని SPR విద్యా కాన్సెప్ట్ స్కూల్ లో ఈ దారుణమైన ఘటన జరిగింది. చిన్న పిల్లాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ గా స్కూల్ ఫిజికల్ ట్రైనర్ కుమార్ ఈ శిక్షను విధించాడు. తప్పును మన్నించమని టీచర్ ను విద్యార్ధి వేడుకున్నప్పటికీ ఆ టీచర్ కనికరించలేదు. మూత్రం కలిపిన ఫ్రూట్ జ్యూస్ మొత్తం తాగేంత వరకూ వదిలిపెట్టలేదు.

ఫిబ్రవరి 3న స్కూల్ కు వచ్చిన స్టూడెంట్.. క్లాస్ లోని మరో విద్యార్థినితో గొడవ పడ్డాడు. విద్యార్ధిని ఫ్రూట్ జ్యూస్ బాటిల్ లో తన మూత్రాన్ని కలిపాడు. ఆ విషయాన్ని తనే స్వయంగా ఆ అమ్మాయికి చెప్పాడు. జ్యూస్ లో మూత్రం కలిపానని.. తాగొద్దని చెప్పాడు. ఈ విషయాన్ని ఆ చిన్నారి ఫిజికల్ ట్రైనర్ కుమార్ కు చెప్పింది. దీంతో ఆ టీచర్.. మూత్రం కలిపిన ఆ విద్యార్ధితోనే ఆ జ్యూస్ తాగించాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్ధి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పేరంట్స్.. టీచర్ ను ప్రశ్నించగా ఆ పనిష్మెంట్ కు ఆ విద్యార్ధి అర్హుడే అంటూ ఆ టీచర్ సమర్ధించుకున్నాడు. దీంతో అదే రోజు సాయంత్రం పేరంట్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. సోమయారం (ఫిబ్రవరి 5) పోలీసులు ఆ టీచర్ ను ఐపీసీ సెక్షన్ 270, సెక్షన్70 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్ధానిక కోర్టు అతడికి రెండు వారాల జుడీషియల్ కస్టడీ విధించింది.

Posted in Uncategorized

Latest Updates