టూరిజం అవార్డుతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కు నేషనల్ టూరిజం అవార్డు లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి కే.జే ఆల్ఫోన్స్ చేతుల మీదుగా సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం అమిత్ వరదన్,  స్టేషన్ డైరెక్టర్ డి.వాసుదేవరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు లంభించడంతో స్టేషన్ ను మరింత ముస్తాబు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ఈ సందర్భంగా ఇవాళ (అక్టోబర్-1) స్టేషన్ లో క్లీన్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేసిన అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. క్లీనింగ్, వైఫై, డ్రింకింగ్ వాటర్, టైమ్ కు ట్రైన్స్ రన్ అయ్యేలా..ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు అధికారులు. 1874లో ప్రారంభమైన సికింద్రాబాద్ స్టేషన్ గుండా, ప్రస్తుతం నిత్యం 210 రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రోజూ 1.8 లక్షల మంది ప్రయా ణీకులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇండి యన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా పచ్చదనం పరిరక్షణలో ఇదివరకే ఈ స్టేషన్ ప్లాటినం రేటింగ్‌ ను సాధించింది.

 

Posted in Uncategorized

Latest Updates