టూర్ షెడ్యూల్ ఇదే : విజయవాడకు సీఎం కేసీఆర్

kcr-duraammaముఖ్యమంత్రి KCR గురువారం (జూన్-28) విజయవాడ వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొక్కిన దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా…ఉదయం పదకొండున్నారకు కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్తారు. నివేదనలు పూర్తికాగానే రాష్ట్ర ప్రజల తరుపున అమ్మవారికి కానుకను సమర్పిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్  చేరుకుంటారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణతో పాటు ఏపీలోని తిరుమల శ్రీవారితో పాటు బెజవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుమల శ్రీవారికి సాలిగ్రామహారం, కంఠాభరణం చేయించారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు.

సీఎం టూర్ షెడ్యూలు

-ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరతారు.
-11.30 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
-11.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న వెటర్నరీ యూనివర్సిటీ గెస్ట్‌ హౌస్‌ కు చేరుకుని, అక్కడ బసచేస్తారు.
-మధ్యాహ్నం 12.40 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి బయలుదేరివెళ్తారు. అమ్మవారి పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

 

Posted in Uncategorized

Latest Updates