టూర్ సక్సెస్ : ప్రపంచాన్ని చుట్టేసిన నేవీ మహిళా ఆఫీసర్లు

NAVYఇండియన్ నేవీ మహిళా కమాండర్ల ప్రపంచ యాత్ర పూర్తైంది. గతేడాది సెప్టెంబర్ 10న పనాజీ నుంచి యాత్ర ప్రారంభించిన నేవీ విమెన్ క్రూ తిరిగి సోమవారం (మే-21) గోవా పోర్ట్ లిమిట్స్ లోకి వచ్చేశారు. వారికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్వాగతం పలికారు. మహిళా నావికులు మే 23న ఢిల్లీ వెళ్లనుండగా… వారిని సన్మానించనున్నారు ప్రధాని మోడీ.

నావికా సాగర్ పరిక్రమ పేరుతో INSV తరిణి పడవలో ఆరుగురు నేవీ మహిళా సిబ్బంది 2017 సెప్టెంబర్ 10న ప్రపంచ యాత్రకు బయలుదేరారు. 9 నెలల పాటు వారి యాత్ర జరిగింది. దీనికి లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషీ నాయకత్వం వహించారు. లెఫ్టినెంటర్ కమాండర్లు ప్రతిభా జమ్వాల్, స్వాతి, లెఫ్టినెంట్లు ఐశ్వర్య బొడ్టపాటి, విజయా దేవి, పాయల్ గుప్తాలు సభ్యులుగా ఉన్నారు. వీళ్లు మొత్తం 21 వేల 600 నాటికల్ మైళ్లు ప్రయాణం చేశారు.


Posted in Uncategorized

Latest Updates