టూ మచ్ : అంబేద్కర్ విగ్రహాల రంగు మార్చేస్తున్నారు

blueకాషాయ రంగుతో ఉన్నరాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహాన్ని రీ పెయింటింగ్ చేశారు BSP లీడర్ హిమేంద్రగౌతమ్. విగ్రహానికి బ్లూ పెయింటింగ్ వేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడౌన్ జిల్లాలోని దుగ్గరయ్యా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఈ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో జిల్లా అధికారులు ఆగ్రా నుంచి హుటాహుటిన మరో అంబేద్కర్ విగ్రహం తీసుకువచ్చి ప్రతిష్ఠించారు.

అయితే అంబేద్కర్ పేరుకు రాంజీని చేరుస్తూ వివాదం రేకేత్తించిన యోగి సర్కార్, కాషాయరంగు కోటు వేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరో వివాదానికి తెరతీసింది. ఈ రోజు హిమేంద్ర గౌతమ్ తన అనుచరులతో విగ్రహానికి బ్లూ పెయింట్ వేశారు. గ్రామస్ధులకు కాషాయ రంగుతో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా.. ఎందుకు విగ్రహానికి బ్లూ పెయింట్ వెయ్యాల్సి వచ్చిందో సమాధానం చెప్పేందుకు అతను నిరాకరించాడు.

Posted in Uncategorized

Latest Updates