టెక్నాలజీతో శాంతిభద్రతలు కాపాడుతున్నాం : డీజీపీ

dgp1502రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు.. డీజీపీ మహేందర్ రెడ్డి. హ్యాక్ ఐ, టీఎస్ కాప్, లాస్ట్ రిపోర్ట్, ట్రాఫిక్ లైవ్, ఈ పెట్టే కేస్ లాంటి 24 యాప్స్ తీసుకొచ్చామని చెప్పారు. మంగళవారం (ఫిబ్రవరి-27) నేషనల్ ఈ గవర్నెన్స్ రెండోరోజు సదస్సు HICCలో జరుగుతోంది. బెస్ట్ ప్రాక్టీసెస్ అనే అంశంపై జరుగుతున్న ప్యానెల్ డిస్కషన్ లో డీజీపీ మహేందర్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో దేశంలోనే ముందున్నామని చెప్పారు. హైదరాబాద్ లో 2లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. ఇక సివిల్ సప్లై శాఖలో టెక్నాలజీ వినియోగంతో అక్రమాలు అరికడుతున్నామన్నారు సీవీ ఆనంద్.

Posted in Uncategorized

Latest Updates