టెక్నాలజీ ఎఫెక్ట్.. భార్యాభర్తల్ని విడదీసిన గూగుల్ ఫొటో

టెక్నాలజీని ఇలా కూడా వాడుకోవచ్చా అనిపించేలా చేశాడో భర్త. టెక్నాలజీ ఉపయోగించి తన భార్య చేసిన మోసాన్ని బయటపెట్టి విడాకులు తీసుకొన్నాడు. పెరూలో ఈ ఘటన జరిగింది.  టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఎవరూ ఏదీ దాచిపెట్టలేరన్న విషయం మరోసారి రుజువైపోయింది.

2013 సంవత్సరంలో తన భార్య వేరే వ్యక్తితో కలిసి పార్కు లాంటి ప్రదేశంలో బెంచిమీద ఉన్న ఫొటోను గూగుల్ స్ట్రీట్ వ్యూలో సంపాదించాడు. అప్పటివరకు అతడికి ఆ విషయంలో ఉన్న అనుమానం కాస్తా నిజమైంది. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యింది. తన భార్య ధరించిన దుస్తులను బట్టే ఆమెను గుర్తుపట్టగలిగినట్లు సదరు భర్త చెప్పాడు. పెరూ రాజధాని లిమా నగరంలో ప్యుంటె డి లాస్ సస్పిరోస్ దగ్గర ఈ ఫొటో తీశారు. అది ఇప్పటికీ గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఉంది. ఆ ఫొటోలో అతడి భార్య తన ప్రేమికుడిని ఒడిలో పడుకోబెట్టుకున్నట్లు ఉంది.

Posted in Uncategorized

Latest Updates