టెక్నికల్ ప్రాబ్లమ్ : 90 నిమిషాల పాటు నిలిచిపోయిన ఇండిగో సేవలు

టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో అన్ని ఎయిర్ పోర్ట్ లలో ఇండిగో ఎయిర్ లైన్స్ సిస్టమ్స్‌ డౌన్‌ అయ్యాయి. సాంకేతిక కారణాలతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో వివిధ గమ్యస్ధానాలకు చేరవలసిన ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్ లో చిక్కుకున్నారు. సిస్టమ్స్‌ డౌన్‌ అవడంతో వివిధ ఎయిర్ పోర్ట్ లలో ప్రయాణీకులు నిలిచిపోయారని, సంయమనంతో తమకు సహకరించాలని ఇండిగో ట్వీట్‌ చేసింది. సమస్యను తొందరగా అధిగమిస్తామని, అప్పటివరకూ సంస్థకు సహకరించాలని ప్రయాణీకులను కోరింది. 90 నిమిషాల పాటు సిస్టమ్స్‌ పనిచేయక పోవడంతో ప్రయాణీకులకు ఎదురైన అసౌకర్యానికి క్షమించాలని కోరింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన మీదట విమానాల రాకపోకలను పునరుద్ధరించారు.

Posted in Uncategorized

Latest Updates