టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్స్ : ప్రభుత్వ స్కూళ్లకే ప్రాధాన్యత

SSCటెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది తెలంగాణ విద్యాశాఖ. ఎగ్జామ్ సెంటర్లలో ప్రభుత్వ స్కూళ్లకే ప్రాధాన్యత ఇచ్చింది. స్కూళ్లలో అన్ని రకాల వసతులు ఉండాలని ఆదేశించింది. మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన విద్యాశాఖ… సీసీ కెమెరాలతో నిఘా పెట్టనుంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. మార్చి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు  జరగనున్న ఎగ్సామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11వేల 109 సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.

మొత్తం 5లక్షల 60వేల 395 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో గతంలో ఫెయిల్ అయిన విద్యార్ధులు 35వేల 869 మంది, ఒకేషనల్ విద్యార్ధులు 19వేల 986 మంది ఉన్నారు. ఈ ఏడాది ఎగ్జామ్ సెంటర్ల కోసం ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా గవర్నమెంట్ స్కూళ్లనే ఎంపిక చేసింది విద్యాశాఖ.  అయితే వీటిలో చాలా స్కూళ్లలో కనీస వసతులు కూడా లేవు. దీంతో అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే  సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించి.. వాటిలో మాత్రమే సీసీ కెమెరాల అరెంజ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తరపున 21 స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండగా… మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో సొంతగా అరెంజ్ చేసుకోవాలని యాజమాన్యులకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ విద్యార్ధులకు నేషనల్ అచీవ్ మెంట్ సర్వే టెస్ట్ నిర్వహించింది విద్యాశాఖ. అయితే ఈ ఎగ్జామ్ రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ క్వాలిటి, స్టేటస్ తెలుసుకునేందుకు తప్పా.. విద్యార్ధుల మధ్య ర్యాంకింగ్స్ కోసం కాదంటున్నారు అధికారులు. ఈ ఎగ్జామ్స్ ను రాష్ట్రంలోని 2వేల 884 స్కూళ్ల నుంచి 92వేల 978 మంది విద్యార్ధులు రాసినట్లు చెబుతున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నామంటున్నారు విద్యాశాఖ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates