టెన్షన్… టెన్షన్ : వరదలు పోయి పాములు వచ్చాయి

వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంబైలో ఇప్పుడు వరదల్లో కొట్టుకువచ్చిన పాములు, కొండచిలువలు ప్రజలను భయపెడుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 10 అడుగుల కొండచిలువ, ఓ నల్లత్రాచును ఆఫీస్, ఇళ్ల దగ్గర గుర్తించారు.
శుక్రవారం(జులై-13) విరార్ ఈస్ట్ మండ్వి లోని ఆది ఎంటర్ ప్రైజస్ ఆఫీసు ఆవరణలో ఉన్న గేటుకు అతుక్కుపోయిన 10 అడుగుల కొండచిలువను తీసుకెళ్లి ఫారెస్ట్ లో వదిలిపెట్టారు పాములు పట్టే వినోద్ పాటిల్. ఆదివారం(జులై-15) వాసయ్ వెస్ట్ లోని అంబాది రోడ్డులోని ఓ గ్యారేజీలో ఉన్న టూవీలర్ డ్యాష్ బోర్డులో ఉన్న నల్లత్రాచుని కూడా తీసుకెళ్లి ఫారెస్ట్ లో వదిలిపెట్టారు. అధిక వర్షాలు వరదల కారణంగా పొడి ప్రాంతాలలో విశ్రాంతి కోసం పాములు అర్బన్ సిటీలోకి వస్తున్నాయని ప్లాంట్ అండ్ ఎనిమల్స్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నిలేష్ బనాగీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates