టెన్షన్… టెన్షన్ : సిటీలో డేంజర్ గా కేబుల్, కరెంట్ వైర్లు

 ఎక్కడ  ఏ వైర్  తెగి  కింద  పడుతుందో  తెలియదు. ఆ ఏరియా..  ఈ ఏరియా  అనే తేడా  లేదు. ఎక్కడ చూసినా  రోడ్డు పక్కన  వందల్లో  వేలాడుతూ  కనిపిస్తుంటాయి.  వర్షాకాలం  కావడంతో  కరెంటు, కేబుల్ వైర్లతో  జనం  ఇబ్బందులు పడుతున్నారు.  బల్దియా  అధికారులు  స్పందించి.. రోడ్డు  పక్కన  ఉండే  వైర్లు తొలగించాలని  కోరుతున్నారు.

సిటీలో కరెంటు, కేబుల్ వైర్లు డేంజర్ గా మారాయి. కరెంటు పోల్స్.. చెట్లపై వేలాడుతూ.. రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి. ఈ వైర్లతో.. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని జనం బిక్కు బిక్కుమంటున్నారు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఏ వైర్ తెగి పడుతుందో తెలియడం లేదంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని చెబుతున్నారు జనం.

ఫుట్ పాత్ పై నుంచి వెళ్లే వారికైతే కేబుల్ వైర్లతో చాలా ఇబ్బంది ఎదురవుతోంది. కరెంటు పోల్ ఉన్నచోట కేబుల్ తీగలు కిందపడి ఉన్నాయి. ఇంకొన్ని చోట్లలో మనిషికి అందేంత ఎత్తులోనే వైర్లు వేలాడుతున్నాయి. కేబుల్  వైర్ అవసరం లేకున్నా అలాగే చుట్టలు కట్టి పోల్ కె తగిలించి పెడుతున్నారు. దాంతో వర్షాలకు వైర్లు తెగి కింద పడుతున్నాయి. ఒక వైర్ కి ఇంకో వైర్ తాకి షాక్ వస్తుందంటున్నారు సిటీ జనం. పబ్లిక్ ఎక్కువ ఉండే ఏరియాల్లో అయినా వీటిని తొలగించాలని కోరతున్నారు. స్కూల్స్, హాస్పిటల్స్, బస్టాప్స్, కాలేజ్ దగ్గర కేబుల్ వైర్లతో ప్రమాదాలు జరగవచ్చని భయపడుతున్నారు. గాలి, వానకు చెట్టుకొమ్మలు విరిగి.. కరెంట్ తీగలు కూడా కిందపడే అవకాశం ఉంది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పంటున్నారు సిటీ జనం.

 

Posted in Uncategorized

Latest Updates