టెర్రరిస్టుగా మారిన కశ్మీర్ సోల్జర్.. ముగ్గురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్

దేశ సరిహద్దులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పులను సైన్యం తిప్పికొడుతోంది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో…. శనివారం తెల్లవారుజామున జమ్మూలోని పుల్వామా జిల్లా సరిహద్దు గ్రామమైన సిర్నూలో భద్రతా బలగాలు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించాయి. కలుగులో దాగి ఉన్న ఎలుకలు బయటకు వచ్చినట్టు… దాక్కుని ఉన్న టెర్రరిస్టులు బయటకు వచ్చి సైన్యంపై కాల్పులకు దిగారు. ఉగ్రవాదుల ఫైరింగ్ తో అప్రమత్తమైన సైన్యం… ఎదురుకాల్పులు జరిపింది. నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసింది.  మరింతమంది ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తోంది.

చనిపోయిన ఈ ముగ్గురిలో కశ్మీర్ లోని గతంలో సైన్యంలో పనిచేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి పేరు జహూర్ అహ్మద్ థోకర్. గతంలో సైన్యంలో పనిచేశాడు. గత జులై నెలలో ఆర్మీ ఇచ్చిన సర్వీస్ రైఫిల్, ఆయుధాలతో సహా అతడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని 173 టెరిటోరియల్ ఆర్మీ అప్పట్లోనే ప్రకటించింది. తాజాగా తెలిసిందేమిటంటే….  జహూర్ అహ్మద్ థోకర్ గత జులై నెలలోనే.. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. టెర్రరిస్టుగా మారి దేశానికే వెన్నుపోటు పొడిచాడు. చివరకు సైన్యం కాల్పుల్లో చనిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు, ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఎన్ కౌంటర్ తో అక్కడి ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates