టెలికాం యూటర్న్: 13 కాదు.. 10 అంకెల్లోనే నెంబర్

ytr

24 గంటల్లోనే యూటర్న్ తీసుకుంది టెలికాం శాఖ. మీ మొబైల్‌ నంబర్‌ 13 అంకెల్లోకి మారుతుందంటూ సంచలన ప్రకటనపై వివరణ ఇచ్చింది. ఫిబ్రవరి 21 బుధవారం అంతా మీడియా, సోషల్ మీడియాలో 13 అంకెల మొబైల్ నెంబర్ అంటూ భారీ ప్రచారం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నదని.. జాతీయ పత్రికలు, ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. ఆందోళన పడొద్దని కస్టమర్లను కోరినా.. అది మరింత ప్రచారం జరిగి పోయింది. 10 అంకెల నెంబర్ నే గుర్తుంచుకోలేకపోతున్నాం.. ఇక 13 అయితే ఎలా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టెలికాం వెనక్కుతగ్గింది. దీంతో టెలికాం శాఖ మళ్లీ రంగంలోకి దిగింది. వివరణ ఇచ్చింది.

జులై 1 నుంచి మిషన్ టూ మిషన్ సిమ్ నెంబర్లకు మాత్రమే 13 అంకెల నెంబర్ ఉండనుందని స్పష్టం చేసింది. అంటే స్వైపింగ్ మిషన్స్ ఉన్న వారికి మాత్రమే 13 అంకెల నెంబర్ కేటాయింపు ఉంటుదని తెలిపింది. మిగతా కస్టమర్లకు ఎప్పటిలాగానే 10 అంకెల నెంబర్ ఉంటుందని ప్రకటించిది. ఎయిర్‌టెల్‌, జియో, ఐడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రకటనలు చేశాయి.

అన్ని టెలికం ఆపరేటర్లకు.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్‌ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు తప్పుగా ప్రచారమయ్యాయని..  దీంతో కోట్లాది మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారని వెల్లడించింది టెలికాం శాఖ. స్వైపింగ్ మిషన్లు, స్మార్ట్‌ ఎలక్ట్రిసిటీ మీటర్లు, వాహనాల ట్రాకింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, టెలిమెడిసిన్‌, విమానాల నిర్వహణ వంటి వ్యవస్థల్లో ఉపయోగించే సిమ్ కార్డులకు మాత్రమే 13 అంకెలు ఉంటాయని తెలిపింది. భద్రతా కారణాలతో వాటి నెంబర్లను మార్చుతున్నట్లు తెలిపింది. రెగ్యులర్ కస్టమర్ల నెంబర్లు 10 అంకెలతో యథావిథిగా ఉంటాయని తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates