టెస్ట్ బుక్స్ లో ఇలా : సీతను అపహరించింది రాముడేనట

SITAసీతను అపహరించింది ఎవరని అడిగితే అందరి నోటా ఠక్కున వచ్చే సమాధానం లంకాధిపతి రావణాసురుడు. అయితే సీతను అపహరించింది రావణాసురుడు కాదంటా.. రాముడే సీతను అపహరించాడంటా. మీరు విన్నది నిజమే. గుజరాత్ బోర్డు విడుదల చేసిన 12వ తరగతి సంస్కృత టెస్ట్ బుక్ లోని 106వ పేజీలోని రఘువంశం పాఠంలో ఈ విషయం స్పష్టంగా ఉంది.

రామాయణంలో రాముడే సీతను అపహరించాడని ముద్రించారు. ఈ పాఠం చదివిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కనీసం పరిజ్ణానం కూడా లేదా అంటూ తిట్టిపోశారు పేరంట్స్. అనువాద లోపం కారణంగానే సంస్కృత టెస్ట్ బుక్ లో పొరపాటు జరిగిందని గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్ట్స్ బుక్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్ పెథన్ తెలిపారు. పిల్లల టెక్ట్స్ బుక్స్ ముద్రించే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన విద్యాశాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఏంటని నిలదీస్తున్నారు పేరంట్స్.

గుజరాతీ భాషలోని టెస్ట్ బుక్స్ లో మాత్రం ఎలాంటి తప్పూ జరగలేదన్నారు. ఇటీవల రాజస్ధాన్ లో దేశాన్ని రక్షించాడు కాబట్టి బాలగంగాధర తిలక్ ను ఫాథర్ ఆఫ్ టెర్రరిజమ్ గా 8వ తరగతి సోషల్ టెస్ట్ బుక్ లో ప్రింట్ అయిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ తప్పుని సరిచేశారు. ఇప్పుడు ఇలా. రామాయణాన్నే మార్చేసిన ఘనులు వీళ్లు.. ఇంక పిల్లలకు చదువు ఏం చెబుతారు అంటూ తిట్టిపోస్తున్నారు ప్రజలు.

Posted in Uncategorized

Latest Updates