టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ : రూ.10లక్షల బైక్ ఎత్తుకెళ్లాడు

bike chorచాలా పోష్ గా ఉన్నాడు కుర్రోడు.. ఆ యుకుడిని చూస్తే ఎంతైనా సరే బైక్ కొంటానికే వచ్చాడు అన్నట్లు హంగామా చేశాడు.. అడ్వాన్స్ కూడా చెల్లించాడు.. గలగల ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు.. టెస్ట్ రైడ్ అడిగాడు.. ఓకే అంటూ చేతిలో తాళం పెట్టారు.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు.. ఎదరుచూసీ చూసీ పోలీసులకు కంప్లయింట్ చేశాడు బాధితుడు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన ఈ ఘటన ఆన్ లైన్ చీటింగ్ కు పరాకాష్ఠగా చెప్పొచ్చు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆగ్రాలోని పాలెం విహార్ ప్రాంతంలో నివాసం ఉండే అజయ్ సింగ్ జూన్ 13వ తేదీన ఆన్ లైన్ లో ఓ యాడ్ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న హార్లీ డేవిడ్ సన్ బైక్ అమ్మకానికి కలదు అని. ఈ అడ్వర్ టైజ్ చూసిన రాహుల్ (30) అనే యువకుడు జూన్ 14వ తేదీన అజయ్ సింగ్ కు కాల్ చేశాడు. మార్బుల్ బిజినెస్ చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. బైక్ బాగుంటే కొనుగోలు చేస్తానని చెప్పాడు. బండి చూడటానికి గుర్ గ్రాంలోని సైబర్ హబ్ దగ్గరకు రావాలని చెప్పాడు. మీటింగ్ ప్లేస్ డిసైడ్ కావటంతో అజయ్ సింగ్ తన బైక్ తో స్పాట్ కు వచ్చాడు. రాహుల్ మాట్లాడే ఇంగ్లీష్, బైక్స్ గురించి అతని నాలెడ్జ్ చూసి షాక్ అయ్యాడు ఓనర్ అజయ్ సింగ్. ఇద్దరు మాట్లాడుకున్నారు. రూ.7లక్షలకు డీల్ అయ్యింది. అడ్వాన్స్ గా రూ.7వేలు ఇచ్చాడు రాహుల్. వెహికల్ చెకప్ కోసం మళ్లీ కలుద్దాం అని వెళ్లిపోయారు ఇద్దరూ.

జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 3.40గంటకు బండి ఓనర్ అజయ్ కు ఫోన్ చేశాడు రాహుల్. బైక్ బాగా నచ్చింది.. మిగతా డబ్బు కూడా ఇవాళే ఇచ్చేస్తా.. ఓసారి బండి తీసుకుని సెక్టార్ 34లోని హార్లీ డేవిడ్ సన్ షోరూం దగ్గరకు వస్తే షోరూంలో చూయించి ఫైనల్ చేస్తా అని చెప్పాడు. ఈ మాటలు నమ్మిన అజయ్ సింగ్.. తన బైక్ తో సహా షోరూం దగ్గరకు వచ్చాడు. టెస్ట్ రైడ్ పేరుతో బండి తీసుకున్న రాహుల్.. అంతే పత్తా లేకుండా పోయాడు. ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. నాలుగు రోజులుగా ఆచూకీ కూడా లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్నారు. అయినా ఈ కేటుగాడు ఆచూకీ కూడా లభ్యం కావటం లేదు..

Posted in Uncategorized

Latest Updates