టేస్ట్ అదరహో : ఏపీ బ్రాండ్ గా బొంగు బిర్యానీ

ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు(బ్యాంబూ) బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల బిర్యానీ అనగానే హైదరాబాద్‌ను గుర్తు చేసుకుంటారు. అదే స్థాయిలో బొంగు బిర్యానీ అనగానే ఏపీని గుర్తుచేసుకునే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఈ బిర్యానీని దేశ వ్యాప్తంగా విస్తృత వినియోగంలో తేవాలని నిర్ణయించింది. ఇందుకోసం హోటళ్లలో పనిచేస్తున్న చెఫ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఆంధ్రా ఆహారాన్ని(ఫుడ్‌) ప్రచారంలోకి(ప్రమోట్‌) తెచ్చేందుకు వార్షిక ప్రణాళికను సిద్ధం చేసింది పర్యాటక శాఖ.

Posted in Uncategorized

Latest Updates