టేస్ట్ అదరాలి : బీజేపీ పకోడీ పార్టీలు

modi-pakodaబీజేపీ సరికొత్త నినాదం ఎత్తింది. అప్పట్లో ఛాయ్ వాలా అన్నట్లుగానే.. ఇప్పుడు పడోకీ పార్టీలకు ప్లాన్ చేస్తోంది. నిరుద్యోగులుగా ఉండే కంటే.. పకోడీలు అమ్ముకోవటంలో తప్పులేదన్న మోడీ, అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. అందుకు ధీటుగా.. పకోడీ వ్యాపారులకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగింది. నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గంలో ఫిబ్రవరి 12న పకోడీ పార్టీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు బీజేపీ ఎంపీ తివారీ. ఆ తర్వాత ఢిల్లీలోని 14 జిల్లా కేంద్రాల్లో పకోడీ పార్టీలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తోంది బీజేపీ.

ఈ పార్టీ సమావేశానికి పకోడీ వ్యాపారులను ఆహ్వానిస్తారు. పార్టీ ఆఫీసుల్లో పకోడీ కేంద్రాలు పెడతారు. స్నాక్స్ కింద పకోడీలు తీసుకోవాలని ఢిల్లీ బీజేపీ పిలుపునిచ్చింది. ఇది ఉపాధి కల్పించటమే అని.. వారికి ఆదాయం పెంచుతున్నామని అంటున్నారు నేతలు. పకోడీ మీటింగ్స్ ను బూత్ లెవల్ వరకు నిర్వహిస్తామని చెబుతోంది. ఢిల్లీ బాటలోనే మిగతా రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కూడా పకోడీ పార్టీలకు కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఛాయ్ వాలా మీటింగ్స్.. ఇప్పుడు పకోడీ మీటింగ్స్.. కమలం పార్టీకి కలిసి వస్తుందో లేదో చూడాలి…

Posted in Uncategorized

Latest Updates