టేస్ట్ గా ఉంటే రారా ఏంటీ : వెజ్ బిర్యానీతో హాజరు ఫుల్

MID DAY VEG MEALSతెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో వెజ్ బిర్యానీని చేర్చడం వల్ల మరింత సానుకూల ఫలితం కనిపిస్తున్నది. ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తున్నదని, విద్యార్థుల హాజరుశాతం పెరిగినట్లు విద్యా శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 25వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 30 – 40 శాతం పాఠశాలల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లోనూ అమలుకి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ నిధులతో 1-8 తరగతుల వరకు మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందిస్తున్నారు. వారానికి మూడు రోజులు విద్యార్థులకు గుడ్డు పెడుతున్నారు. ప్రతి రోజు అన్నంతోపాటు ఒక గుడ్డు.. ఆకుకూరలతో పప్పు,  సాంబారుతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాభివృద్ధి పథకాల వల్ల వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates