టైటానిక్ పేరుతో రష్యాకు మస్కా..

సోవియట్‌ యూనియన్‌‌‌‌కు మస్కా కొట్టేందుకే టైటానిక్‌ సెర్చింగ్‌‌‌‌ మొదలైందా? 1912లో మునిగిపోయిన టైటానిక్‌ గురించి సెర్చ్‌‌‌‌ చేస్తున్నట్టు సోవియట్‌ భావించేలా అమెరికా మిలిటరీ చేసిందా? టైటానిక్‌ మిషన్‌ అసలు టార్గెట్‌ నీట మునిగిపోయిన రెండు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్స్‌ను గుర్తించడమా? దీనికి అవుననే సమాధానం చెపుతోంది ‘టైటానిక్‌ మిషన్‌’లో పాల్గొన్న టీమ్‌. అసలు టైటానిక్‌ మిషన్‌ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్‌‌‌‌ స్టోరీ ఏమిటీ?

టైటానిక్‌‌‌‌.. ఈ పేరు వినగానే ఓ పెద్ద ఓడ.. భారీ మంచు పలకను ఢీ కొట్టి నడి సముద్రంలో అది మునిగిపోవడం.. 1,500 మందికి పైగా మరణించడం.. ఇవన్నీ మన కళ్లముందే మెదలుతాయి. 1912 ఏప్రిల్‌‌‌‌ 15న నార్త్‌‌‌‌ అట్లాంటిక్‌‌‌‌ సముద్రంలో టైటానిక్‌‌‌‌ మునిగిపోతే.. 1985లో దాని జాడను కనుగొన్నారు. అయితే టైటానిక్‌‌‌‌ సెర్చింగ్‌‌‌‌ చాలా ఆసక్తికరంగా సాగింది. దీనిని కనుక్కోవడానికి మూడేళ్ల ముందు అంటే 1982లో రాబర్ట్‌‌‌‌ బల్లార్డ్ అనే అమెరికా నేవీ  ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ టైటానిక్‌‌‌‌ గురించి సెర్చ్‌‌‌‌ చేయాలని  భావించాడు. ఇందుకోసం తానే స్వయంగా రిమోట్‌ కంట్రోల్‌‌‌‌తో నడిచే అండర్‌ వాటర్‌ వెహికల్‌‌‌‌ను డిజైన్‌‌‌‌ చేశాడు. అయితే టైటానిక్‌‌‌‌ మిషన్‌‌‌‌కు చాలా నిధులు అవసరం. తన దగ్గ ర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు.

కండిషన్‌ పెట్టిన నేవీ

తన మిషన్‌‌‌‌కు నిధులు సమకూర్చాలని అతడు అమెరికన్‌‌‌‌ నేవీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ రోనాల్డ్‌‌‌‌ తున్మన్‌‌‌‌ను కోరాడు. దీనికి అంగీకారం తెలిపిన అతడు.. ఓ కండిషన్‌‌‌‌ పెట్టాడు. అదేంటంటే వారు ఇచ్చే ఫండ్‌తోనే 1960ల్లో అట్లాంటిక్‌‌‌‌ సముద్రంలో కనిపించకుండా పోయిన రెండు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను గుర్తించడం. 1965లో యూఎస్‌ఎస్‌ థ్రెషర్‌ సబ్‌మెరైన్‌ ‌‌‌బోస్టన్‌‌‌‌ తీరానికి 200 మైళ్ల దూరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 129 మంది చనిపోయారు. ఇక 1969లో 99 సిబ్బందితో వెళుతున్న స్కార్పియన్‌‌‌‌ సబ్‌మెరైన్‌‌‌‌ అజోర్స్‌ ప్రాంతంలో అనూహ్యంగా కనిపించకుండా పోయింది. అయితే ఎక్కడా సబ్‌మెరైన్ల కోసం సెర్చ్‌‌‌‌ చేస్తున్నట్టు తెలియకూడదని, ఇదో టాప్‌ సీక్రెట్‌ మిషన్‌‌‌‌ అని చెప్పారు. కోల్డ్‌‌‌‌వార్‌ టైమ్‌ కావడంతో వాటిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని అటు అమెరికా, ఇటు రష్యా కూడా సెర్చింగ్‌‌‌‌ మొదలుపెట్టాయి. ఇలాంటి సమయంలో నేవీ కండిషన్‌‌‌‌కు బల్లార్డ్‌‌‌‌ అంగీకరిం చాడు. తాను టైటానిక్‌‌‌‌ మిషన్‌‌‌‌ కోసం వెళుతున్నట్టు ప్రపంచానికి చెప్పారు. 1985లో బల్లార్డ్‌‌‌‌ థ్రెషర్‌ ‌, స్కార్పియన్లను కనిపెట్టగలిగాడు. కానీ ఇందుకు అతడు అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్‌ పట్టింది.

మిగిలింది 12 రోజులే

సబ్‌మెరైన్లను కనిపెట్టిన తర్వాత బల్లార్డ్‌‌‌‌ కు టైటాని‌‌‌క్‌‌‌‌ను కనిపెట్టేందుకు 12 రోజుల సమయమే మిగిలింది. స్కార్పియన్‌‌‌‌ సబ్‌మెరైన్‌‌‌‌ను కనిపెట్టే క్రమంలో టైటానిక్‌‌‌‌ను ఎలా కనిపెట్టాలనే దానిపై అతడికి ఒక ఐడియా వచ్చింది. దానిని పక్కాగా ఫాలో అయిపోయిన బల్లార్డ్‌‌‌‌ ఆ త‌ర్వాత ఎనిమిది రోజుల్లోనే నీటి అడుగున  టైటానిక్‌‌‌‌ షిప్‌ను కనుగొన్నాడు. అదే ప్రాంతంలో ఇతరులు రెండు నెలల పాటు సెర్చ్‌‌‌‌ చేసినా దాని జాడ కనిపెట్టలేకపోయారని బల్లార్డ్‌‌‌‌ చెప్పాడు. తన మిషన్‌‌‌‌ చివరి నాలుగు రోజులు అతడు అండర్‌ వాటర్‌‌‌‌లో టైటానిక్‌‌‌‌ శిథిలాలను వీడియో తీశాడు. టైటానిక్‌‌‌‌ ఉన్న చోటుకి వెళ్లే సమయంలో తన టీమ్‌ మూడ్‌ మారిపోయిందని, అక్కడి చేరుకునే సమయంలో ఎవరి సమాధి పైనో తాము డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపించిందని, చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ షిప్‌ నుంచి ఏమీ తీసు కోకూడదని తాము నిర్ణయించుకున్నామని, దానిని గౌరవంగా చూడాలని అనుకున్నామని చెప్పారు. ప్రస్తుతం టైటానిక్‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌లో ని నేషనల్‌‌‌‌ జియోగ్రాఫిక్ ‌‌‌మ్యూజియంలో ఓ సబ్జెక్ట్ గా ఉంది.

Posted in Uncategorized

Latest Updates